సాగులో సాంకేతికను పెంపొందించడానికి ప్రభుత్వం సబ్సిడీపై డ్రోన్లు మంజూరు చేస్తుంది. మూడు రోజుల క్రితం దహెగాం, కొత్తపేట, గురుడుపేట సొసైటీలకు సబ్‌మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ పథకం కింద మూడు స్ప్రే డ్రోన్లను అందించాం. రైతులకు కూడా 40 శాతం సబ్సిడీపై అందిస్తాం. ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాలి. పత్తి కట్టె, వరిగడ్డిని భూమిలో కలిపే మల్చర్ అనే యంత్రాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. కట్టెను చిన్నగా కట్ చేసి ఎరువులా మార్చుకుంటే భూమికి పోషకాలు అందుతాయి.
– వెంకట్, జిల్లా వ్యవసాయాధికారి


