ఆసిఫాబాద్‌అర్బన్: తొలి స్వాతంత్య్ర యోధుడు, ఆదివాసీ ముద్దుబిడ్డ రాంజీ గోండ్ 166వ వర్ధంతిని గురువారం జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్ మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం జరిగిన తొలి పోరాటంలో అనేక మంది ఆదివాసీలు బ్రిటీష్ సామ్రాజ్యవాదులు, స్థానిక రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దినకర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్, నాయకులు రాజ్‌కుమార్, పవన్‌కుమార్, కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ కార్యాలయంలో..
జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో డీసీసీ అ ధ్యక్షురాలు ఆత్రం సుగుణ మర్సుకోల రాంజీ గోండ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాంజీ గోండ్ చేసిన త్యాగాలు మరువలేనివని, స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులని కొనియాడారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన రాంజీ గోండ్ చరిత్రను యువత తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు విజయ్‌కుమార్, తిరుపతి, గోపాల్, నాగోరావ్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.


