కాగజ్‌నగర్‌టౌన్: ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, దివంగత ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యకు గుర్తింపు దక్కిందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. పట్టణంలోని భట్టుపల్లి చౌరస్తాకు కావేటి సమ్మయ్య చౌరస్తాగా నామకరణం చేయగా గురువారం బోర్డును ప్రారంభించారు. దివంగత ఎమ్మెల్యే సమ్మయ్య సతీమణి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కావేటి సాయిలీల మాట్లాడుతూ కావేటి సమ్మయ్య చౌరస్తాగా నామకరణం చేయడంలో చొరవ చూపిన ఎమ్మెల్సీ దండె విఠల్, మున్సిపల్ పాలకవర్గం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు కావేటి సమ్మయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ షాహిన్ సుల్తానా, కౌన్సిలర్లు ఎమ్మాజీ శారద, కచ్చకాయల జ్యోతి, వసీమున్నిసా, కావేటి విజయ్‌కుమార్, నాయకులు ఎమ్మాజీ సంతోష్, యూసుఫ్, కొండ్ర జగ్గాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


