నేడు నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో సీఎం పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో సీఎం పర్యటన

Apr 6 2026 7:48 AM | Updated on Apr 6 2026 7:48 AM

బాసరలో రూ.225 కోట్ల పనులకు శంకుస్థాపన మధ్యాహ్నం ఆదిలాబాద్‌ జిల్లా పిప్రిలో బహిరంగ సభ ఏర్పాట్లు చేసిన అధికారులు

భైంసా/బాసర/కై లాస్‌నగర్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం నిర్మల్‌ జిల్లా బాసర, ఆదిలా బాద్‌ జిల్లా పిప్రిలో పర్యటించనున్నారు. మొదట బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి అన్నిశాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఏర్పాట్లు చే సినట్లు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ తెలిపారు. బాసర మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా రూ.225 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలం పిప్రిలో బహిరంగసభలో పాల్గొంటారు.

సీఎం పర్యటన షెడ్యూల్‌ ఇలా..

ఉదయం 10.20 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాప్టర్‌లో బాసరకు బయల్దేరుతారు. 11గంటలకు బాసర హెలీప్యాడ్‌కు అక్కడి నుంచి రాజన్న గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. 11.10 నుంచి 12.10 వరకు బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తారు. మధ్యాహ్నం 12.15 నుంచి 12.30 వరకు ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారు. 12.30 నుంచి 1.30 వరకు రిజర్వ్‌ టైమ్‌. 1.45 గంటలకు బాసర నుంచి ఆదిలాబాద్‌ జిల్లాకు వెళ్తారు. 2.15 గంటలకు పిప్రికి చేరుకుంటారు. 2.20 నుంచి 2.30 వరకు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. 2.30 నుంచి సాయంత్రం 4.10 గంటల వరకు బహిరంగసభలో పాల్గొంటారు. ఐఎస్‌వో సర్టిఫికెట్లు, వడ్డీలేని రుణాల చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తారు. సీఎం కప్‌ విజేతలకు ట్రోఫీని బహూకరిస్తారు. 4.20గంటలకు హైదరాబాద్‌కు తిరిగి పయనమవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement