ఆసిఫాబాద్‌అర్బన్: స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్‌రావ్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కలెక్టర్ కె.హరిత పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆవరణలో ఆదివారం జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ అహ్మద్, ఏఎంసీ చైర్మన్ ఇరుకుల మంగ, వివిధ సంఘాల నాయకులతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ని వాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జగ్జీవన్‌రామ్ స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయ వేత్తగా అణగా రిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన సూచించిన మార్గం ఆచరణీయమని, ఆయన ఆశయ సాధన కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఎ మ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. అణగారిన వర్గాల హక్కుల కోసం, సమానత్వం, సమన్యాయం, ఐక్య త కోసం బాబూ జగ్జీవన్‌రామ్ చూపించిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికా రి అశోక్, కుల సంఘాల ప్రతినిధులు కేశవ్‌రావ్, సిడాం అర్జు, గంగుబాయి, గణేశ్, శంకర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


