ఆస్పత్రిలో ఎమర్జెన్సీ సేవలు కరువు | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో ఎమర్జెన్సీ సేవలు కరువు

Apr 6 2026 7:48 AM | Updated on Apr 6 2026 7:48 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: మండలంలోని సాలెగూడ గ్రామపంచాయతీ గొల్లగుడ గ్రామానికి చెందిన లచ్చన్న అనారోగ్యంతో బాధపడుతుండగా ఆదివా రం అతడి కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అతడిని వైద్యులు ఎమర్జెన్సీ వార్డుకు తరలించి పరీక్షలు నిర్వహించారు. వెంటిలేటర్‌ లేదని కుటుంబీకులకు తెలిపారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరిగెల నాగేశ్వర్‌రావ్‌ వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని లచ్చన్నను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.

‘ప్రాణాలతో చెలగాటమాడొద్దు’

ఈ సందర్భంగా అరిగెల నాగేశ్వర్‌రావు మాట్లాడు తూ.. జిల్లా కేంద్రంలో అలంకారప్రాయంగా మారి న 200 పడకల ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందడం లేదని మండిపడ్డారు. ఆస్పత్రికి వచ్చే రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరి కాదని పేర్కొన్నారు. ఆస్పత్రిలో సరైన వైద్యం అందక పేదలు ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లి రూ.లక్షలు ఖర్చు చేసుకుంటున్నారని తెలిపారు. రూ.100 కోట్లతో ఆస్పత్రి భవనం నిర్మించినా సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్ల కొరత ఉందని తెలిపారు. ఇప్పటికై నా కలెక్టర్‌ చొరవ చూపి ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం అందేలా చూడాలని, అన్ని రకాల వైద్యం, పరికరాలు అందుబాటులో ఉంచాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement