గోండు పిల్లలు.. మెరికలు | - | Sakshi
Sakshi News home page

గోండు పిల్లలు.. మెరికలు

Apr 5 2026 7:42 AM | Updated on Apr 5 2026 7:42 AM

● తెలుగులోనే మాట్లాడాలని నిర్ణయం ● ఆంగ్లంపైనా పట్టు పెంచుతున్న వైనం ● తల్లిదండ్రులతో ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపు ● హోంవర్క్‌ చేసేలా హెచ్‌ఎం పర్యవేక్షణ

చిత్రంలో కనిపిస్తున్న ఏడేళ్ల గోండు విద్యార్థిని పేరు పర్చకి వర్ష. కొఠారి పాఠశాలలో రెండోతరగతి చదువుతోంది. మాతృభాష గోండి అయినప్పటికీ తెలుగులో చక్కగా మాట్లాడుతోంది. సాధారణ వాక్యాలను ఇంగ్లిష్‌లో చెప్పగలదు. రాష్ట్ర గీతం, జాతీయ గీతం, వందేమాతరం, ప్రతిజ్ఞ, జయజయహే తెలంగాణ గీతం చూడకుండా స్పష్టంగా పాడుతుంది.

కెరమెరి: మండలంలోని కొఠారి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే గోండు పిల్లలు గోండు భాషతోపాటు తెలుగులోనూ స్పష్టంగా మాట్లాడి అందరినీ అబ్బురపరుస్తున్నారు. ఈ పాఠశాలలో ఒకటి నుంచి నాలుగు వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. 15మంది విద్యార్థులున్నారు. నాలుగో తరగతిలో ఆరుగురు విద్యార్థులుండగా ఐదుగురు, రెండోతరగతిలో ఐదుగురు విద్యార్థులుండగా నలుగు రు తెలుగు పాఠాలు స్పష్టంగా చదవగలుగతున్నా రు. ఆంగ్లంలోనూ నాలుగో తరగతి విద్యార్థుల్లో ముగ్గురు బాగా చదువుతున్నారు. ప్రధానోపాధ్యాయుడు పడాల నందకుమార్‌, గ్రూపు స్టడీ, టీఎల్‌ఎంకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. పాఠశాల ఆవరణలోకి రాగానే విద్యార్థులంతా తెలుగు మాట్లాడేలా హెచ్‌ఎం శిక్షణ ఇచ్చారు. గోండి భాష మినహా మరే భాష తెలియని పిల్లలు ఈ బడిలో చదువుతూ తెలుగు, ఆంగ్లం స్పష్టంగా మాట్లాడే స్థాయికి ఎదగడం విశేషం.

వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసి..

ప్రధానోపాధ్యాయడు విద్యార్థులు తల్లిదండ్రులతో వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేశారు. ఇంటి వద్ద వి ద్యార్థులు ఉదయం 6నుంచి 7గంటల వరకు చదవాలని, సాయంత్రం 6 నుంచి 8గంటల వరకు రా యాలని నిర్ణయించారు. వారు రాస్తున్న, చదువుతు న్న ఫొటోలను వారి తల్లిదండ్రులు వాట్సాప్‌ గ్రూ ప్‌నకు షేర్‌ చేసేలా చర్యలు చేపట్టారు. దీంతో హోంవర్క్‌ ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా పూర్తి చేస్తున్నారు. ఫలితంగా పాఠశాలలో చెప్పిన పా ఠ్యాంశాలు, కథలు, గేయాలు వారికి కంఠత ఉంటున్నాయి.

ప్రతీ విద్యార్థిపై శ్రద్ధ పెడుతున్నాను

పాఠశాలలోని ప్రతీ విద్యార్థి పై శ్రద్ధ పెడుతున్నాను. తెలుగు, ఆంగ్ల భాషలపై పట్టుకోసం బడిలో వారి గోండి భాషను నిషేధించాను. బడిలో ఉన్నంతవరకు తెలుగు, ఇంగ్లిష్‌ లోనే మాట్లాడాలనే నిబంధన పెట్టాను. విద్యార్థులు ఇంటి వద్ద తప్పనిసరిగా చదవడం, హోంవర్క్‌ చేసేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్‌ గ్రూపు ద్వారా పర్యవేక్షిస్తున్నాను. ఇందుకు తల్లిదండ్రులు సహకరిస్తుండగా సత్ఫలితాలు వస్తున్నాయి.

– పడాల నందకుమార్‌,

ప్రధానోపాధ్యాయుడు, కొఠారి

ఉన్నతంగా తీర్చిదిద్దాలి

ఆయా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. విద్యార్థులకు అన్ని భాషల్లో రాయడం, చదవడం రావాలి. కొఠారి హెచ్‌ఎం చక్కగా విద్యార్థులకు బోధిస్తున్నారు. చిన్నపిల్లలు కూడా బాగా తెలుగు మాట్లాడగలుగుతున్నారు. అన్ని పాఠశాలల్లోని చిన్నారులు తెలుగు, ఆంగ్లంలో మాట్లాడే స్థాయికి ఎదగాలి. ఇందుకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలి.

– ఆడే ప్రకాశ్‌, ఎంఈవో, కెరమెరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement