కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధి లోని ప్రధాన రహదారులకు ఇరువైపులా అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను శనివారం మున్సిపల్ క మిషనర్ తిరుపతి సిబ్బందితో తొలగించారు. అక్ర మ నిర్మాణాల తొలగింపుతో తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చిరువ్యాపారులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన క మిషనర్ ప్రజాప్రయోజనాల దృష్ట్యా పట్టణ ప్రజల కు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే అక్రమ నిర్మాణాలు తొలగించాల్సి వస్తోందని తెలిపారు.
పూర్తి స్థాయిలో తొలగిస్తారా?
పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలోని రోడ్డు ఇరువైపులా ఉన్న చిరువ్యాపారుల షెడ్లు తొలగించారు. కానీ, పట్టణంలోని ప్రధాన రాజీవ్ గాంధీ చౌ రస్తా, అంబేడ్కర్ చౌరస్తా, పొట్టి శ్రీరాములు చౌర స్తా, రైల్వే ఓవర్‌బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న దుకా ణాలను తొలగిస్తారా? అనే సందేహం పట్టణ ప్రజ ల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన చర్యలు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయని ఆరోపణ లు వినిపిస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో ఒకేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య అ ధికంగా ఉన్న ప్రధాన చౌరస్తాల్లోని అక్రమ నిర్మాణా లు తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


