కెరమెరి: కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తోందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం 124 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.1,00,116 అందిస్తోందని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలు అప్పులపాలు కాకుండా గౌరవప్రదంగా వివాహాలు జరుపుకొనేందుకు అవకాశం కలుగుతోందని పేర్కొన్నారు. తహసీల్దార్ గోడాం సంతోష్‌కుమార్, సర్పంచ్ పెందోర్ ఆనంద్‌రావు, మాజీ వైస్ ఎంపీపీ అబ్దుల్ కలాం, నాయకులు యూనస్, నిసార్, జాహెద్ తదితరులున్నారు.


