గోలేటి ఓసీపీని త్వరగా ప్రారంభించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో నూతనంగా చేపట్టబోయే గోలేటి ఓసీపీని త్వరగా ప్రారంభించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. సోమవా రం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సింగరేణి సీఅండ్‌ఎండీ బలరాంను మర్యాదపూర్వకంగా కలి శారు. గోలేటి ఓసీపీ ఏర్పాటు పనులను వేగంగా చేపట్టి ప్రాజెక్టును త్వరగా ప్రారంభించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాలో ఒకప్పుడూ సింగరేణి గనులతో కళకళాడిందని ఆ సమయంలో ఎంతో మందికి ఉపాధి దొరికిందన్నారు. ప్రస్తుతం ఏరి యాలో ఒక్క గని మాత్రమే ఉండగా మరో మూడేళ్లలో ఆ ఒక్క ఓసీపీ సైతం మూతపడనుందన్నారు. ఈ సమయంలో జిల్లాలో కొత్తగా సింగరేణి గనుల ఏర్పాటు ఆవశ్యకత ఎంతగానో ఉందన్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సింగరేణి నిధులు కేటాయించాలని కోరారు.


