ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని అంకుసాపూర్‌లో గల ప్రభుత్వ వైద్య కళాశాలలో సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా విద్యార్థులు, వైద్యాధికారులు, సిబ్బంది జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆరో గ్యం బాగుంటేనే జీవితంలో ఏదైనా సాధించగలమని పేర్కొన్నారు. వైద్యులు సతీష్, సత్యం, సిబ్బంది రషీద్, సలిత, విద్యార్థులు పాల్గొన్నారు.


