ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Jun 28 2026 12:10 AM | Updated on Jun 28 2026 12:10 AM

ముదిగొండ: మండ లంలోని బాణాపురం గ్రామపంచాయతీ కార్యదర్శి తమ్మిశెట్టి సురేశ్‌ ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాలను ఏసీబీ ఉమ్మడి జిల్లా డీఎప్పీ వై.రమేశ్‌ వెల్లడించారు. బాణాపురం గ్రామానికి చెందిన రైతు కర్నె వీరబాబు 5 కుంటల స్థలంలో రేకులతో గది నిర్మించుకున్నాడు. దీనికి అనుమతి ఇవ్వడంతో పాటు ఇంటి నంబర్‌ కేటాయించాలని గత నెల 15న గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, పంచాయతీ కార్యదర్శిని పలుమార్లు కలిసినా ఫలితం లేకపోగా, రూ.40 వేలు ఇస్తే అనుమతి వస్తుందని తేల్చిచెప్పాడు. అంత స్థోమత లేదని రైతు బ్రతిమిలాడడంతో రూ.25వేలకు ఒప్పుకున్నాడు. అయితే, డబ్బు కోసం వేధించడంతో తట్టుకోలేని రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు వారు అన్ని ఆధారాలు సేకరించగా, శనివారం గ్రామంలోని రైతు వేదిక వద్ద వీరబాబు నుంచి రూ.25 వేలు తీసుకుంటున్న సురేశ్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనను గ్రామపంచాయతీ కార్యాలయంలో దాదాపు మూడు గంటల పాటు విచారించిన అధికారులు కార్యాలయ లావాదేవీలపై ఆరా తీశారు. కాగా, కార్యదర్శి సురేశ్‌ను వరంగల్‌లోని కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ రమేశ్‌ వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులెవరైనా లంచం కోసం వేధిస్తే 94404 46106 వాట్సప్‌ నంబర్‌ లేదా 1068 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

షెడ్డుకు అనుమతి, నంబర్‌ కోసం

రూ.25 వేలు డిమాండ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement