తాగునీటి తంటా తీరేలా.. | - | Sakshi
Sakshi News home page

తాగునీటి తంటా తీరేలా..

Jun 27 2026 12:07 AM | Updated on Jun 27 2026 12:07 AM

● వర్షాలు ఊపందుకోక పాలేరులో తగ్గుతున్న నీటి నిల్వలు ● ఇదే పరిస్థితి కొనసాగితే ఇక్కట్లు ● సమస్య పరిష్కారానికి ఎన్నెస్పీ నీరు విడుదల ● మూడు జిల్లాలకు తప్పనున్న ఇబ్బందులు

పాలేరులో తగ్గిన నీటిమట్టం

ప్రతిరోజు ‘భగీరథ’ ద్వారా సరఫరా

● వర్షాలు ఊపందుకోక పాలేరులో తగ్గుతున్న నీటి నిల్వలు ● ఇదే పరిస్థితి కొనసాగితే ఇక్కట్లు ● సమస్య పరిష్కారానికి ఎన్నెస్పీ నీరు విడుదల ● మూడు జిల్లాలకు తప్పనున్న ఇబ్బందులు

పాలేరు రిజర్వాయర్‌లో

కనిష్టస్థాయికి చేరిన నీటిమట్టం

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎల్‌నినో ప్రభావం పంటల సాగుపై పడడమే కాక, తాగునీటి సమస్యకూ కారణమవుతోంది. ఇన్నాళ్లు పాలేరు, వైరా రిజర్వాయర్లలో ఆశించిన స్థాయిలోనే తాగునీటి నిల్వలు ఉండగా.. వర్షాలు లేక, ఎండలు తగ్గక అవి క్రమేణా క్షీణిస్తున్నాయి. దీంతో తాగునీటి కటకట ఏర్పడకుండా నాగార్జునసాగర్‌ నుంచి ఎడమకాల్వకు నీరు విడుదల చేస్తున్నారు. పాలేరు రిజర్వాయర్‌ నీటిమట్టం ఒక టీఎంసీకి చేరేవరకు నీరు విడుదల చేయడమే కాక, ఆపై వైరా, లకారం ట్యాంక్‌బండ్‌ల్లోకి చేర్చి తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు.

తాగునీటికి కీలకం

జిల్లాతోపాటు ఖమ్మం నగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఎన్నెస్పీ ఉపయోగపడుతోంది. ఇక ఖమ్మం నగరంలోని కొంత మేర, చుట్టుపక్కల ప్రాంతాలకు మున్నేరు నది తాగునీటి వనరుగా ఉంది. అయితే, పాలేరు రిజర్వాయర్‌ ఆధారంగా మిషన్‌ భగీరథ పథకం కొనసాగుతోంది. వేసవిలో పాలేరు రిజర్వాయర్‌లో నిల్వ ఉండే నీటిని సాగు అవసరాలకు కాక, తాగునీటికే సరఫరా చేస్తారు. ఇందులో నీటిమట్టం తగ్గితే సాగర్‌ ప్రాజెక్టు నుంచి ఎడమకాల్వకు విడుదల చేస్తూ, దానవాయిగూడెం హెడ్‌వర్క్స్‌ వద్ద నిల్వ చేసి సరఫరా చేస్తారు.

మూడు జిల్లాల దాహార్తి తీరుస్తూ..

పాలేరు రిజర్వాయర్‌పై ఖమ్మం, సూర్యాపేట, పాత వరంగల్‌ జిల్లాల ప్రజల తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. రిజర్వాయర్‌ నుంచి కూసుమంచిలోని కొన్ని గ్రామాలు, నేలకొండపల్లి, రఘునాథపాలెం, ఖమ్మంరూరల్‌, ముదిగొండ, తిరుమలాయపాలెం, ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాలే కాక పాత వరంగల్‌ జిల్లాలోని 16 మండలాలు, సూర్యాపేట జిల్లాలోని మోతె మండలంలోని కొన్ని గ్రామాలు, జాజిరెడ్డిగూడెం, నాగారం, మద్దిరాల, నూతన్‌కల్‌, తుంగతుర్తి, చెవ్వెంల, ఆత్మకూరు మండలాలకు నీటి సరఫరా జరుగుతోంది. ఇక వైరా రిజర్వాయర్‌ ద్వారా ఎర్రుపాలెం, బోనకల్‌, చింతకాని, కొణిజర్ల, కల్లూరు, తల్లాడ మండలంలోని కొన్ని గ్రామాలు, వైరా మండలం, వైరా మున్సిపాలిటీ, మధిర మండలం, మధిర మున్సిపాలిటీ, దానవాయిగూడెం హెడ్‌వర్క్స్‌ నుంచి ఖమ్మం కార్పొరేషన్‌కు తాగునీరు అందుతోంది. ఈ రిజర్వాయర్లలో నీరు అడుగండితే ఆయా ప్రాంతాలన్నింటికీ ఇక్కట్లు తప్పవు.

ఎన్నెస్పీ నుంచి పాలేరుకు..

పాలేరు రిజర్వాయర్‌లో నిల్వలు తగ్గుముఖం పట్టడంతో ఎన్నెస్పీ అధికారులు ఎడమకాల్వ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. రెండు వేల క్యూసెక్కుల నీటిని సాగర్‌ నుంచి విడుదల చేయగా.. శనివారం పాలేరు రిజర్వాయర్‌కు చేరనున్నాయి. రిజర్వాయర్‌లో ఒక టీఎంసీ నీరు చేరేవరకు వారం పాటు సరఫరా జరుగుతుంది. తద్వారా వర్షాలు ఎలా ఉన్నా తాగునీటికి ఎలాంటి సమస్య ఎదురుకాదని భావిస్తున్నారు.

ఎల్‌నినో ప్రభావంతో వేసవిలో ఎండలు మండిపోయాయి. వర్షాకాలం వచ్చినా జల్లులు తప్ప భారీ వర్షం లేకపోగా ఎండలూ తగ్గడం లేదు. దీంతో పాలేరు రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 23అడుగులకు గాను ప్రస్తుతం 12.90 అడుగులకు పడిపోయింది. పాలేరు జలాశయంలోని నీటిని ప్రతిరోజూ తాగు అవసరాలకు వినియోగిస్తుండడంతో రోజుకు 0.20 అడుగుల మేర తగ్గుతూ ఇప్పుడు కనిష్ట స్థాయికి చేరింది. దీంతో ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు ఇంకొన్ని

ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై

అయోమయం నెలకొంది.

ఇన్‌ టేక్‌వెల్‌ నీటి సరఫరా

(క్యూసెక్యుల్లో)

పాలేరు – 01 6.4

02 110.16

03 2.34

04 16.56

వైరా రిజర్వాయర్‌ 45.37

చనుమోలు 19.4

లకారం ట్యాంక్‌బండ్‌ 2.48

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement