సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు

Jun 26 2026 12:07 AM | Updated on Jun 26 2026 12:07 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: యువ కార్మికులు ఎదుర్కొంటున్న ఉపాధి, వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత వంటి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు, రాష్ట్ర నాయకులు కళ్యాణం వెంకటేశ్వరావు పేర్కొన్నారు. సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యాన ఖమ్మంలో గురువారం జరిగిన యంగ్‌ వర్కర్ల సదస్సులో కార్మికుల సమస్యలు, చట్టాల అమలు, కాంట్రాక్ట్‌ విధానం, కనీస వేతనాల అమలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మధు మాట్లాడుతూ యువ కార్మికులను సంఘటితం చేసి వారి హక్కుల సాధన కోసం ఉద్యమాలను నిర్మించాలని తెలిపారు. దేశంలో యువతకు శాశ్వత ఉపాధి కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. కార్మిక చట్టాలను బలహీనపరుస్తూ కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నందున, యువ కార్మికులు హక్కుల సాధనకు ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కన్వీనర్‌గా ఎస్‌.నవీన్‌రెడ్డి

ఈ సదస్సులో జిల్లా స్థాయి యంగ్‌ వర్కర్ల కమిటీని ఏర్పాటు చేసి, కన్వీనర్‌గా ఎస్‌.నవీన్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విద్యార్థి, యువజన ఉద్యమాల్లోనే కాక గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టు బాధిత రైతుల ఉద్యమ నిర్మాణంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ఇబ్బంది పడుతున్న యువతను సంఘటితం చేసి బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు బండారు యాకయ్య, పి.మోహన్‌రావు, దొంగల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

సీఐటీయూ రాష్ట్ర నాయకులు

మధు, వెంకటేశ్వరావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement