డెయిరీ మూసివేత యత్నాలు సరికాదు | - | Sakshi
Sakshi News home page

డెయిరీ మూసివేత యత్నాలు సరికాదు

Jun 26 2026 12:07 AM | Updated on Jun 26 2026 12:07 AM

ఖమ్మం మామిళ్లగూడెం: ఖమ్మంలోని విజయ డెయిరీని మూసివేస్తే సహించేది లేదని బీజేపీ జిల్లా అద్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు పేర్కొన్నారు. వరంగల్‌ యూనిట్‌ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పాలు, పెరుగు సరఫరా చేయాలని ఆదేశించడంతో ఖమ్మం డెయిరీ మనుగడపై ప్రభావం పడుతుందన్నారు. ఈమేరకు గురువారం డెయిరీ ఎదుట బీజేపీ ఆధ్వర్యాన ధర్నా నిర్వహించగా కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో వేలాది మంది రైతులకే కాక ప్రజలకు ఉపయోగంగా ఉన్న డెయిరీ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు పాలకులు కుట్ర పన్నారని ఆరోపించారు.

జెడ్పీ సెంటర్‌లో నిరసన

నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించి 51 ఏళ్లు కావడంతో ఖమ్మం జెడ్పీ సెంటర్‌లో సంవిధాన్‌ హత్యాదివస్‌(ఎమర్జెన్సీ వ్యతిరేక దినం) పేరిట నిరసన తెలిపారు. ఈకార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామలింగేశ్వరరావుతో పాటు నాయకులు గల్లా సత్యనారాయణ, రుద్ర ప్రదీప్‌, గుత్తా వెంకటేశ్వరరావు, డీకొండ శ్యామ్‌, నాయుడు రాఘవరావు, శ్యామ్‌రాథోడ్‌, వీరవెల్లి రాజేష్‌, నకిరేకంటి వీరభద్రం, ఎల్లారావు గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement