‘సర్‌’.. మొదలైంది | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’.. మొదలైంది

Jun 26 2026 12:07 AM | Updated on Jun 26 2026 12:07 AM

● ఎన్యుమరేషన్‌ ఫారమ్‌ పూర్తిచేసిన కలెక్టర్‌ దివాకర ● ప్రక్రియపై ఉద్యోగులకు సూచనలు

● ఎన్యుమరేషన్‌ ఫారమ్‌ పూర్తిచేసిన కలెక్టర్‌ దివాకర ● ప్రక్రియపై ఉద్యోగులకు సూచనలు

ఖమ్మంసహకారనగర్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా వచ్చేనెల 24 వరకు ఇంటింటి ఎన్యుమరేషన్‌ను కీలకంగా పరిగణించాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ఆదేశించారు. ఇంటింటా ఓటర్లకు ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ జిల్లాలో గురువారం మొదలైంది. ఈ సందర్భంగా ఖమ్మం 46వ డివిజన్‌లోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌కు గురువారం బీఎల్‌ఓలు ఎన్యుమరేషన్‌ ఫామ్‌ అందించగా, ఆయన వివరాలు నమోదుచేసి సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ఓటర్ల వివరాలు సేకరించి కచ్చితమైన ఓటరు జాబితా రూపొందించాలని సూచించారు. ఎన్యుమరేషన్‌ ఫారాలు నింపడంలో ఓటర్లకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఇది సమర్పించకపోతే జాబితాలో పేరు ఉండదనే విషయాన్ని వివరించాలని తెలిపారు.

అదనపు కలెక్టర్‌ పరిశీలన

కొణిజర్ల: సమగ్ర ఓటరు సవరణ(ఎస్‌ఐఆర్‌) కొణిజర్ల మండలంలో ప్రారంభమైంది. మండలంలోని 60 పోలింగ్‌ బూత్‌ పరిధిలో 75శాతం ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తికాగా, ఇంటింటా ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీని బీఎల్‌ఓలు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మండలంలోని పల్లిపాడులో ఫామ్‌ల పంపిణీని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి శ్రీజ పరిశీలించి బీఎల్‌ఓలకు సూచనలు చేశారు. మండలంలో 4,381మంది ఓటర్ల వివరాలు అనామలీస్‌ జాబి తాలో పెట్టినందున వారి ఆధారాలు సేకరించి ధ్రువీ కరించుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్‌ నారపోగు అరుణ, ఆర్‌ఐలు రమేష్‌, నరేష్‌, ఏఎస్‌ఓ తిరపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement