
చెరువులో మునిగి రైతు మృతి
చింతకాని: మండలంలోని నాగులవంచ గ్రామంలోని రామసముద్రం చెరువులో ప్రమాదవశాత్తు మునిగి గ్రామానికి చెందిన రైతు తోటకూరి జగన్ (35) ఆదివారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. జగన్ గేదెలను మేతకోసం పొలానికి తీసుకెళ్లి తిరిగి ఇంటికి తీసుకొస్తుండగా.. గేదెలు నీళ్ల కోసం రామసముద్రంలో చెరువులోకి దిగాయి. అవి బయటకు రాకపోవటంతో జగన్ చెరువులోకి దిగి, మునిగిపోయాడు. ఆయనకు ఈత రాకపోవటంతో మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ నాగుల్‌మీరా పరిశీలించి, మృతదేహాన్ని బయటకు తీయించి, ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
రెడ్డిచెరువులో సోదరులు గల్లంతు?
చింతకాని: మండలంలోని నాగులవంచ గ్రామానికి చెందిన మత్స్యకారులు, సోదరులు కంభం నాగేశ్వరరావు, సత్యం రెడ్డిచెరువులో గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కంభం నాగేశ్వరరావు గ్రామంలోని రెడ్డిచెరువును లీజుకు తీసుకుని చేపల పెంపకం చేపట్టాడు. రోజూ మాదిరిగానే తన తమ్ముడు సత్యంతో కలిసి ద్విచక్ర వాహనంపై చెరువు వద్దకు వెళ్లారు. చీకటి పడినప్పటికీ వారు ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు ఫోన్‌చేయగా స్విచ్‌ఆఫ్ రావటంతో ఆందోళనతో చెరువు వద్దకు వెళ్లా రు. చెరువు కట్టపై ద్విచక్ర వాహనం, దుస్తులు, చెప్పులు విడిచి ఉండటాన్ని గుర్తించి గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ నాగుల్‌మీరా చెరువు వద్దకు చేరుకుని స్థానికుల సహకారంతో నాటు పడవల్లో గాలించినప్పటికి ఆచూకీ లభ్యం కాలేదు. రాత్రి సమయం కావటంతో గాలింపు చర్యలు నిలిపివేశారు.
రైలుకింద పడి గుర్తుతెలియని
వృద్ధురాలు మృతి
ఖమ్మంక్రైం: రైలుకింద పడి గుర్తుతెలియని వృద్ధురాలు (70) మృతిచెందిన ఘటనపై ఖమ్మం జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. సారథినగర్ ప్రాంతంలో రైలుకింద పడి వృద్ధురాలు మృతిచెందింది. మృతదేహాన్ని పోలీసులు గుర్తించి, ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి వద్ద వరంగల్ నుంచి విజయవాడకు, గుంటూరు నుంచి వరంగల్‌కు తీసుకున్న టిక్కెట్లు లభించాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళగా భావిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
మధిర పట్టణంలో చోరీ
మధిర: పట్టణంలోని నందిగామ బైపాస్ రోడ్డు సమీపంలోని ఓ ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చెరుకూరి నాగార్జున శనివారం హైదరాబాద్ వెళ్లగా ఆయన సతీమణి లక్ష్మి ఎన్టీఆర్‌జిల్లా వత్సవాయి మండలం మక్కపేటలోని పుట్టింటికి వెళ్లింది. గుర్తుతెలియని దుండగులు అదే రోజు రాత్రి తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రూ.1.20 లక్షల నగదు, 4 బంగారు గాజులు, నల్లపూసల గొలుసు చోరీచేశారని, సుమారు రూ.9లక్షల సొత్తును అపహరించినట్లు బాధితుడు తెలిపారు. మరో గది తలుపు గడియ పగలగొట్టి దుస్తులు, వస్తువులను చిందరవందర చేశారు. ఘటనా స్థలాన్ని టౌన్ ఎస్‌హెచ్‌ఓ రమేశ్‌తో పాటు ఖమ్మం నుంచి క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
నేలకొండపల్లి: రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీటీసీ, గ్రామదీపికకు గాయాలైన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. కోనాయిగూడెం గ్రామానికి చెందిన గ్రామదీపిక, మాజీ ఎంపీటీసీ కొమ్మినేని పుష్పావతి స్కూటీపై వెళ్తుండగా గేదెలు అడ్డు వచ్చాయి. ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో ఆమె కిందపడి గాయపడింది. ఆమెను మాజీ సర్పంచ్‌లు పెంటమళ్ల పుల్లమ్మ, తురక పాపయ్యతోపాటు వడ్లమూడి నర్సయ్య తదితరులు పరామర్శించారు.

చెరువులో మునిగి రైతు మృతి

చెరువులో మునిగి రైతు మృతి