
ముగిసిన సౌత్ ఇండియా కరాటే టోర్నీ
ఖమ్మంస్పోర్ట్స్: నగరంలోని ఎండీ గార్డెన్స్‌లో జరుగుతున్న దక్షిణభారత కరాటే పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీలను విన్‌ఫీల్డ్ పాఠశాల డైరెక్టర్ పి.శ్రీకాంత్ ప్రారంభించారు. దాదాపు 600 మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా.. విజేతలకు నిర్వాహకులు పతకాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు కె.సందేశ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్యుల్లో
రాజకీయ చైతన్యం రావాలి
నేలకొండపల్లి: ఆర్యవైశ్యుల్లో రాజకీయ చైత న్యం రావాలని జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు పసుమర్తి చందర్‌రావు ఆకాంక్షించారు. స్థానిక వాసవీభవన్‌లో పాలేరు నియోజకవర్గ ఆర్యవైశ్య రాజకీయ చైతన్య సదస్సు ఆది వారం నిర్వహించగా.. ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్యవైశ్యులు స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అన్నిట్లోనూ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూ బలం పెంచుకోవాలని చెప్పా రు. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఎవరి నైనా ఎదిరించే శక్తిని సాధించాలని పేర్కొన్నా రు. సమావేశంలో మాటూరి సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వరరావు, నాగుబండి శ్రీనివాసరావు, నరసిహమూర్తి, పి.వెంకటేశ్వర్లు, సీతారామా రావు, హనుమంతరావు, దోసపాటి శేఖర్, గెల్లా జగన్‌మోహన్‌రావు, కనమర్లపూడి రమేశ్, కొత్తా రమేశ్, వంగవీటి నాగేశ్వరరావు, వందనపు నాగేశ్వరరావు, బోనగిరి కిరణ్, కొత్తా రాణి, తెల్లాకుల జయశ్రీ, మైలవరపు సంతోష్, రాయపూడి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
‘లకారం’పైకి సందర్శకులు రాకుండా అడ్డగింత
ఖమ్మంమయూరిసెంటర్: సెలవుదినం ఆదివా రం రోజు పిల్లలతో సేదదీరేందుకు లకారం ట్యాంక్‌బండ్‌కు మధ్యాహ్నం 12 గంటల సమయంలో వచ్చిన సందర్శకులను ఓ యువకుడు లోనికి అనుమతించకుండా అడ్డుకునే ప్రయ త్నం చేశాడు. ట్యాంక్‌బండ్‌పై గంజాయి తాగే వాళ్లు ఉన్నారు.. లోపలకి రాకూడదు అంటూ హల్‌చల్ చేశాడు. దీంతో అక్కడికి వచ్చిన వారు నివ్వెరపోతూ బారికేడ్ల వద్ద ఆగిపోయారు. కొందరిని మాత్రం లోపలకు అనుమతిస్తూ, కొందరిని అడ్డుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో సందర్శకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముగిసిన సౌత్ ఇండియా కరాటే టోర్నీ

ముగిసిన సౌత్ ఇండియా కరాటే టోర్నీ