
హెచ్‌పీఎస్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు
ఖమ్మంమయూరిసెంటర్: హైదరాబాద్ బేగంపేట, రామాంతపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లలో 2025–26 విద్యాసంవత్సరం ప్రవేశాలకు గిరిజన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొన్నారు. ఒకటో తరగతిలో డే స్కాలర్‌గా జిల్లా నుంచి బాలబాలికలకు మూడు చొప్పున సీట్లు కేటాయించగా, లంబాడీ మూడు, కోయలకు రెండుతో పాటు ఇతర గిరిజన కులాలకు ఒక సీటు ఉంటుందని తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన పేద గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్‌లోని గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఈనెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకుంటే ఈనెల 12న లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తామని వెల్లడించారు. అలాగే, హెచ్‌పీఎస్‌ల్లో షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు రెండు సీట్లు కేటాయించగా గెజిటెడ్ అధికారి అటెస్టేషన్ చేసిన జనన, కుల, ఆదాయ, స్థానికత ధ్రువపత్రాలు, రేషన్, ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలతో ఈనెల 8లోగా తమ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ సూచించారు. దరఖాస్తుదారుల్లో ఇద్దరిని ఈనెల 10వ తేదీన లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు.
పనుల్లో నాణ్యతపై
అవగాహన అవసరం
ఖమ్మంఅర్బన్: జలవనరుల శాఖ ద్వారా చేపట్టే పనుల్లో నాణ్యతపై ఇంజినీర్లు అవగాహన కలిగి ఉండాలని, తద్వారా పనులు పదికాలాలు నిలుస్తాయని శాఖ ఎస్‌ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు తెలిపారు. క్వాలిటీ కంట్రోల్ విభాగం ఈఈ వెంకటరమణకుమార్ ఆధ్వర్యాన గురువారం ఇంజనీర్లకు నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఇంజనీర్లు ఏ విభాగంలో విధులు నిర్వర్తించినా నాణ్యతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ క్వాలిటీ కంట్రోల్ డీఈ చంద్రమోహన్, పాలేరు, ఖమ్మం డివిజన్ల ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

హెచ్‌పీఎస్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు