
ప్రతి ఉద్యోగికి పెన్షన్ రావాలి
ప్రతి ఉద్యోగికి పెన్షన్ కావాలని తమ యూనియన్ ఎంతో కాలగా ఉద్యమం చేస్తోంది. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కూడా పెన్షన్ కోసం న్యాయ పోరాటం చేశాం. ఆ ఉద్యమాల ఫలితంగానే నేడు ఈ తీర్పు వచ్చింది. తీర్పును స్వాగతిస్తూనే.. ప్రతి ఉద్యోగికి పెన్షన్ అనేది హక్కు కాబట్టి ఆ దిశగా మా పోరాటం కొనసాగనుంది.
– చంద్రకంటి శశిధర్, టీఎస్ సీపీఎస్‌ఈయూ
జిల్లా అధ్యక్షుడు
ఆనందంగా ఉంది
డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ కల్పించాలని గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతూనే మరో వైపున న్యాయపోరాటం కూడా చేశాం. దాని ఫలితమే ప్రస్తుతం వచ్చిన తీర్పు అని అభిప్రాయపడుతున్నా.
– పల్లా రవి, ఎంపీ యూపీఎస్ సదాశివపురం,
నేలకొండపల్లి మండలం
●

ప్రతి ఉద్యోగికి పెన్షన్ రావాలి