సీఎం సభలో వందేమాతరం వివాదం | - | Sakshi
Sakshi News home page

సీఎం సభలో వందేమాతరం వివాదం

Sep 20 2026 6:42 AM | Updated on Sep 20 2026 6:42 AM

శివమొగ్గ: పశ్చిమ కనుమల సంరక్షణపై కస్తూరి రంగన్‌ నివేదికపై రైతులతో చర్చించేందుకు శనివారం తీర్థహళ్లి పట్టణంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, వందేమాతరం గీతంలో రెండు చరణాలే పాడటంపై గందరగోళం తలెత్తింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్‌–బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వేదికపై ఉన్న బీజేపీ ఎమ్మెల్యే చన్నబసప్ప, గాయకులు వందేమాతరం గీతాన్ని కేవలం రెండు చరణాల్లో పాడడాన్ని వ్యతిరేకించారు. సాగర్‌ ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ వెంటనే ఆయనను నిలదీశారు. దీంతో వేదికపై కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్‌ నాయకులందరూ వేదికపై చన్నబసప్పను చుట్టుముట్టి, ఆయన మాట్లాడకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు చన్నబసప్పకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈలోగా, కాంగ్రెస్‌ నాయకుడు హెచ్‌.సి.యోగీష్‌ వేదికపైకి వచ్చి సీఎం డీకేకి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో మరింత సందోహం నెలకొంది.

రెండే చరణాలపై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement