అనైతిక బంధాలు, కాపురాల్లో కోపావేశాలకు విలువైన ప్రాణాలు బలవుతున్నాయి. దారితప్పి చివరకు రక్తపాతంతో ముగుస్తున్నాయి. ఫలితంగా ఎన్నో కుటుంబాలకు కన్నీరే మిగులుతోంది. ఈ పెడపోకడలు సామాజిక సమస్యగా పరిణమించాయి.
దొడ్డబళ్లాపురం: ముగ్గురు పిల్లల తల్లిని ఆమె ప్రియుడే గొంతుకోసి హతమార్చిన సంఘటన దావణగెరె సిటీ శేఖరప్ప నగరలో జరిగింది. నాగరత్న(45)ను నాగరాజు (36) హత్య చేశాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాగరాజుతో అక్రమ సంబంధం సాగుతోంది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా చొరబడ్డ నాగరాజు కత్తితో హత్య చేశాడు. నాగరత్న ఆర్తనాదాలు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని పరారవుతున్న నాగరాజును పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు.
దావణగెరెలో ప్రియుని చేతిలో
మహిళ హత్య
ప్రియున్ని హతమార్చిన వివాహిత..
పలు జిల్లాల్లో భయానక నేరాలు


