ఈ ఎర్ర చేపలెంత? | - | Sakshi
Sakshi News home page

ఈ ఎర్ర చేపలెంత?

Sep 20 2026 6:42 AM | Updated on Sep 20 2026 6:42 AM

బనశంకరి: రేవు నగరి మంగళూరులో శుక్రవారం కేబినెట్‌ సమావేశం జరిపిన సీఎం డీకే.శివకుమార్‌ శనివారం ఉదయం స్థానిక చేపల ఓడరేవులో ఆకస్మికంగా పర్యటించారు. రకరకాల చేపలను చూసి వాటి ధర వివరాలు తెలుసుకున్నారు. ఉదయం 6 గంటలకు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి చేపల పడవల బందరుకు దారితీశారు.

పడవలకు స్థలం కావాలి

మత్య్సకారుల బోటులో ప్రయాణించి ఓడరేవులో చేపట్టాల్సిన అభివృద్ధి గురించి చర్చించారు. 200 బోట్లను నిలపడానికి సౌకర్యాలు ఉన్నాయి, ఫాల్గుణి, నేత్రావతి నదులు అరేబియా సముద్రంలో కలిసే సంగమంలో కొత్త డాక్‌లను చేస్తే ఎక్కువ పడవలను నిలపవచ్చని మత్స్యకార సంఘాల నేతలు విన్నవించారు. ఓడలు సజావుగా రాకపోకలు సాగించడానికి మార్కింగ్‌లు వేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. చేపల రేవులో కార్యకలాపాలు చాలా తక్కువగా ఉండడంపై సీఎం ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కారణాలు ఏమిటనేది తనకు నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌, నగర కమిషనర్‌ ను ఆదేశించారు. దీనికి అధికారులు కారణమైతే వారిని సస్పెండ్‌ చేస్తానన్నారు. కరావళి దేశ సంపద అని, దీనిని మనం కాపాడుకోవాలని తెలిపారు. కస్తూరి రంగన్‌ నివేదికపై త్వరలో అసెంబ్లీలో చర్చిస్తామని, ఈ ప్రాంత ప్రజల అభిప్రాయం సేకరిస్తామని తెలిపారు. ఆ తరువాత కేంద్ర నోటిఫికేషన్‌పై కఠిన నిర్ణయం తీసుకుంటామన్నారు.

మంగళూరు రేవులో

సీఎం డీకే ఆకస్మిక పర్యటన

మత్స్య సంపద పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement