దొడ్డబళ్లాపురం: తమ కుమారులు చదువుకుని జీవితంలో ఎదిగి చెట్టులా నీడనిస్తారని ఆశించిన తల్లిదండ్రుల కలలు కల్లలయ్యాయి. బెంగళూరులో యలహంక– రాజానుకుంట మార్గంలో బైక్ ప్రమాదంలో వచన్ (20), ప్రదీప్ (21) అనే ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రాజానుకుంట జంక్షన్‌లో బుల్లెట్ బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కన దుకాణం గోడకు వేగంగా ఢీకొన్నారు. తీవ్ర గాయాలతో అక్కడే మరణించారు. మృతులు సమీపంలోని కళాశాలలో ఇంజినీరింగ్ విద్యార్థులు. యలహంక ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సిటీలో యువకులు నైట్ ఔట్, జాలీరైడ్ పేర్లతో షికార్లకు వెళ్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.
భార్య కళ్ల ముందే రైతు..
మైసూరు: జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని కుడ్లపుర గ్రామం సమీపంలో రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఒక రైతు మరణించగా, భార్య తీవ్రంగా గాయపడింది. కవలందే హోబ్లీ, మల్లాహళ్లి గ్రామానికి చెందిన రైతు రమణాయక (45), భార్య గాయత్రి (39) పొలంలో నుంచి ఇంటికి బైక్‌లో వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం వారిని ఢీకొనింది. దీంతో రైతు దుర్మరణం చెందాడు.
యలహంకలో గోడను ఢీకొన్న బైక్..
ఇద్దరు బీటెక్ విద్యార్థుల మృతి


