శివాజీనగర: రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో కొన్ని అత్యవసర సేవలు తాత్కాలికంగా బంద్ అయ్యాయి. ముఖ్యంగా 108 అంబులెన్స్ సేవ, 104 ఆరోగ్య సహాయవాణి సేవా కేంద్రాల కమాండ్ సెంటర్ గురువారం రాత్రి నుంచి బంద్ అయింది. అంబులెన్స్, ఆరోగ్య సహాయవాణి సేవల్లో ఆటంకం ఏర్పడింది. కర్ణాటక డేటా సెంటర్‌లో విద్యుత్ నిర్వహణా కార్యం నేపథ్యంలో సేవలు తాత్కాలికంగా స్తంభించాయి. దీంతో సర్వర్ కనెక్షన్ కట్ అయింది.
సిడాక్ తయారీ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం
కర్ణాటకలోని ఆరోగ్య శాఖ అత్యవసర సేవల విభాగం డేటా, సర్వర్ కేంద్రాల్లో తిరువంతపురం సిడాక్ తయారు చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. మరమ్మతుల నేపథ్యంలో సర్వర్ పూర్తిగా బంద్ అయింది. అందువల్ల సేవలు అందుబాటులో లేవు. సర్వర్ కనెక్షన్ కట్ అయింది. త్వరలో మరమ్మతు పనులు పూర్తికానున్నాయి. ఆ తరువాత సేవలు అందుబాటులోకి వస్తాయి.
ప్రజలకు ప్రత్యామ్నాయ సదుపాయం
సర్వర్ సమస్యతో ప్రజలకు ఇబ్బంది కాకుండా ఆరోగ్య శాఖ ముందు జాగ్రత్తలు తీసుకుంది. ఫోన్ స్వీకరించేందుకు ప్రత్యామ్నాయ కంట్రోల్ రూమ్ తెరిచారు. ప్రజలు ఎప్పటిలానే అత్యవసర సేవలకు 108 ఉచిత నెంబర్‌కు ఫోన్ చేయవచ్చని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఆరోగ్య శాఖ సహాయవాణి 24 గంటలు కూడా పని చేస్తుంది. రాష్ట్రంలో మారుమూలల నుంచి వస్తున్న ఫోన్‌కాల్స్‌కు స్పందిస్తూ రోగులకు సేవలందిస్తుంది. దీని ద్వారా కర్ణాటకలో అత్యవసర సేవలు తగిన సమయానికి లభ్యమయ్యేలా చేయటంలో అత్యవసర సేవలు విజయవంతమయ్యాయి. ప్రస్తుతం అత్యవసర సహాయవాణి ఫోన్, కనెక్షన్ మరింత సులభతరం చేసేందుకు కొత్త సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి పరిచారు.
108 అంబులెన్స్, 104 ఆరోగ్య
సహాయవాణి కమాండ్ సెంటర్ కూడా


