హోసూరు: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం క్రిష్ణగిరి జిల్లా వ్యాప్తంగా వివిధ స్వచ్ఛంధ సంస్థలు, ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, సామాజిక సేవాకర్తలతో చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలో నిర్వహించిన చైతన్య ర్యాలీని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. కొత్త బస్టాండు వద్ద ప్రారంభమైన ర్యాలీ.. లండన్‌పేట, రాయకోట కూడలి రోడ్డు మీదుగా ప్రభుత్వ మహిళా కళాశాలలో ముగిసింది. కలెక్టర్ మాట్లాడుతూ క్రిష్ణగిరి జిల్లాను సంపూర్ణ మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు పళమి, రామచంద్రన్, సెంధిల్ కుమార్, గోవింద స్వామి, రమేష్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.


