రథంపై ఊరేగిన మారెమ్మ | - | Sakshi
Sakshi News home page

రథంపై ఊరేగిన మారెమ్మ

Jun 27 2026 2:13 AM | Updated on Jun 27 2026 2:13 AM

రాయచూరు రూరల్‌: రాయచూరు నగరం హరిజన వాడలో మారెమ్మ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. గురువారం రాత్రి కంచు గడ్డ మారెమ్మకు పాదుకాపట్టాబిషేకం, పుష్పాలంకరణ చేశారు. అంతకుముందు భక్తులు భారీగా తరలివచ్చి ఆలయంలో విశేష పూజలు చేశారు. భక్తులు తెల్లవారుజామున తొట్టెల సేవ చేశారు. శాసన సభ్యుడు శివరాజ్‌ పాటిల్‌, విధాన పరిషత్‌ సభ్యుడు వసంత్‌ కుమార్‌, మాజీ నగర సభ సభ్యులు పవన్‌ కుమార్‌, యల్లప్ప, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్ర జాలదార్‌, భరత్‌ తదితరులు పూజలు చేయించి మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement