నిండు జీవితానికి పోలియో చుక్కలు | - | Sakshi
Sakshi News home page

నిండు జీవితానికి పోలియో చుక్కలు

Jun 27 2026 2:07 AM | Updated on Jun 27 2026 2:07 AM

హొసపేటె: ఈనెల 28 నుంచి జూలై 2వ తేదీ వరకు జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించున్నారు. శుక్రవారం మున్సిపల్‌ కౌన్సిల్‌, ఆరోగ్య శాఖ, మహిళా శిశు అభివృద్ధి శాఖల సహకారంతో అవగాహన ర్యాలీ చేపట్టారు. నగర మున్సిపల్‌ కౌన్సిల్‌ ప్రాంగణంలో పౌర యుక్త గంగాధర్‌ అవగాహన యాత్రను ప్రారంభించి మాట్లాడారు. పిల్లల నిండు జీవితానికి రెండు చుక్కల పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో బీఎస్‌కే మెడికల్‌ ఆఫీసర్‌ రెడ్డి, డాక్టర్‌ మల్లికార్జున తాలూకా హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ భీమరాజ రెడ్డి, సీనియర్‌ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, జూనియర్‌ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ హిమంత్‌ రాజ్‌ బాగ్ని, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ వెంకోబ, ప్రోగ్రామ్‌ మేనేజర్‌ మలేష్‌, కమ్యూనిటీ కో–ఆర్డినేటర్లు, స్వచ్ఛత, ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్త రూయి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement