పురస్కారాలు బాధ్యతలను పెంచుతాయి | - | Sakshi
Sakshi News home page

పురస్కారాలు బాధ్యతలను పెంచుతాయి

Jun 26 2026 6:22 AM | Updated on Jun 26 2026 6:22 AM

హొసపేటె: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తాలూకా శాఖ ఆధ్వర్యంలో రేణుకా సభా భవన్‌లో అఖిల సభ్యుల మహా సమావేశం, ప్రతిభా ప్రోత్సాహ పురస్కార, సేవా రత్న పురస్కారాల ప్రదానోత్సవం–2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఫీల్ట్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ మైలేశ్‌ బేవూరు స్పూర్తిదాయక ప్రసంగం చేశారు. నేడు ప్రభుత్వ ఉద్యోగులు ఒత్తిడిలోనూ, ప్రజా సేవలోనూ విశ్వాసంగా, నిజాయితీ పని చేయాలని అన్నారు. పోటీ రోజున తప్పనిసరిగా చదవాల్సిన అవసరం ఉందన్నారు. మనం తదుపరి దశకు సిద్ధం కావాలన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు, అంకితభావంతో పని చేసిన ఉద్యోగులకు ఇచ్చే పురస్కారాలు ఆ వ్యక్తి బాధ్యతను, గౌరవాన్ని పెంచుతాయని ఆయన అన్నారు. తహసీల్దార్‌ అమరేష్‌, ఈఓ డాక్టర్‌ బీ.ఆనంద్‌కుమార్‌, చీఫ్‌ వెటర్నరీ ఆఫీసర్‌ చంద్రనాయక్‌ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ, పీయూసీ పరీక్షల్లో 90 శాతానికి పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ ఉద్యోగుల 28 మంది పిల్లలకు ప్రోత్సాహక పురస్కారాలు అందజేశారు. వివిధ శాఖలకు చెందిన 32 మంది అధికారులు, ఉద్యోగులకు సేవా రత్న పురస్కారాలు–2026ను ప్రదానం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement