సర్‌ ప్రక్రియపై అవగాహన సమావేశం | - | Sakshi
Sakshi News home page

సర్‌ ప్రక్రియపై అవగాహన సమావేశం

Jun 26 2026 6:22 AM | Updated on Jun 26 2026 6:22 AM

బళ్లారిఅర్బన్‌: నగరంలోని కౌల్‌బజార్‌ ప్రాంతంలోని ఆంఽథోని హాల్‌లో గురువారం ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియపై కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు అవగాహన సమావేశం జరిగింది. కర్ణాటక శాసన మండలి సభ్యులు ఇవాస్‌ డిసౌజా, చంద్రశేఖర్‌ పాటిల్‌, మాజీ ఎమ్మెల్సీ శరణప్ప మట్టూర్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కార్యకర్తలకు సర్‌ గురించి అవగాహన కల్గించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ప్రజా చైతన్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంపై కూడా చర్చించారు. సమావేశంలో నగర మేయర్‌ పీ.గాదెప్ప, నగర, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బోయపాటి విష్ణువర్ధన్‌, కర్ణాటక క్రిస్టియన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జీజే రవికుమార్‌, బోర్డు మాజీ అధ్యక్షుడు మానయ్య, మాజీ డిప్యూటీ మేయర్‌ బెణకల్‌ బసవరాజ్‌, ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు సరగు నాగరాజు, మహిళా విభాగం అధ్యక్షురాలు మంజుల, సీనియర్‌ నాయకులు ఎల్‌.మారెణ్ణ, చానాళ్‌ శేఖర్‌, కణేకల్‌ మాబుసాబ్‌, అలివేలు సురేష్‌, అతావుల్లా, మల్లీశ్వరి, కార్పొరేటర్లు ముండ్లూరు ప్రభంజన్‌కుమార్‌, గోవింద శ్రీనివాస్‌ ఉమాపతి, పర్వీన్‌ భాను తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement