విద్యార్థులకు క్రమశిక్షణ ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు క్రమశిక్షణ ముఖ్యం

Jun 26 2026 6:16 AM | Updated on Jun 26 2026 6:16 AM

కోలారు: ఉపాధ్యాయులు విద్యార్థులకు మౌల్యాధారిత విద్యను బోధించాలని తాపం మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది ఎం.ఎస్‌.శ్రీనివాస రెడ్డి తెలిపారు. గురువారం ముళబాగిలు ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో సద్భావన ఉపాధ్యాయ స్నేహి బళగ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సంస్కారం, ఉత్తమ నడవడిక, క్రమశిక్షణ, పెద్దలను గౌరవించడం నేర్పించాలన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు విజయం సాధించాలంటే అన్ని విషయాలపై అధిక జ్ఞానం, నిరంతర కృషి అవసరమని పేర్కొన్నారు. సద్భావన ఉపాధ్యాయ స్నేహి బళగ వారు ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సాహకాలు అందజేయడం హర్షణీయమన్నారు. దీనికి తోడు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఉద్యోగుల సంఘం కోశాధికారి సుబ్రమణ్య, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్‌.ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement