ఎందుకో తెలియదు: మంత్రి | - | Sakshi
Sakshi News home page

ఎందుకో తెలియదు: మంత్రి

Jun 25 2026 5:41 AM | Updated on Jun 25 2026 5:41 AM

తన బావ మంజునాథ్‌పై ఈడీ దాడులపై బెళగావిలోని హరుగేరిలో పీడబ్ల్యూడీ మంత్రి సతీశ్‌ జార్కిహొళి మాట్లాడుతూ ఆచితూచి స్పందించారు. ఈడీ దాడి గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని, తెలిసిన తరువాత మాట్లాడతానని అన్నారు. ఈడీ దాడి సాధారణ ప్రక్రియ కావచ్చునని, కానీ ఏ కారణంతో సోదాలు చేశారు అనేది తనకు తెలియదన్నారు. ఎలాంటి రికార్డులు అడిగారు, ఎన్ని చోట్ల సోదాలు చేశారు అనేది కూడా తెలియదని ఆయన అన్నారు. దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయన్నారు. మంత్రివర్గ విస్తరణ జూలైలో జరగవచ్చునని, ఎవరికి పదవులు ఇవ్వాలనేది హైకమాండ్‌ నిర్ణయమన్నారు. జిల్లాలో అనావృష్టిపై స్పందిస్తూ, వానలు రాకపోతే ఇబ్బందేనని, హిడకల్‌ డ్యాంలో 15 రోజులకు సరిపడా తాగునీరు ఉందని అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement