శివాజీనగర: రాష్ట్రంలో 66 మంది రౌడీషీటర్లపై షీట్‌ను తొలగించే ప్రతిపాదనను నిలిపివేసినట్లు కొత్త హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, రౌడీషీట్లు తొలగించాలని సిఫార్సు వచ్చినవారిలో 12 మంది పేరుమోసిన రౌడీలు ఉన్నారని తెలిపారు. అలాంటివారిపై షీట్‌ను ఎలా తొలగిస్తారని బెంగళూరు పోలీస్ కమిషనర్‌ను అడిగానన్నారు. ఈ జాబితాలో కొందరు బీజేపీ కార్యకర్తల పేర్లు ఉన్నాయని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను విమర్శిస్తూ ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్‌కు తాను రాసిన లేఖను ఖర్గే సమర్థించుకొన్నారు. కర్ణాటక మంత్రిగా తాను లేఖ రాశాను, సమాధానం ఇవ్వాల్సిందే అన్నారు. రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు 127 శాఖలు ఉన్నాయని తెలిపారు. దీనిపై బీజేపీ నేతలు ఎందుకు కోపగించుకుంటున్నారని అన్నారు.


