మెరుగైన ఫలితాలు సాధించండి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన ఫలితాలు సాధించండి

Apr 26 2026 2:21 AM | Updated on Apr 26 2026 2:21 AM

రాయచూరు రూరల్‌ : జిల్లాలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఉత్తమ ఫలితాలు సాధించాలని యాదగిరి జెడ్పీ సీఈఓ లవీశ్‌ ఒడెయర్‌ వెల్లడించారు. శనివారం కార్యాలయంలో జాతీయ గ్రామ పంచాయతీరాజ్‌్‌ దివస్‌ను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని 28 శాఖల నుంచి ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో వాటిని పరిష్కరించామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహిళలకు అందేలా చూడాలన్నారు. అధికారులు బసవరాజ్‌, శరభయ్య, శంక్రమ్మ, అక్క నాగమ్మ, శారదమ్మ, రాయప్పగౌడ, దేవరాజ్‌, విజయలక్ష్మిలున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement