రాయచూరు రూరల్: నగర ప్రాంతాల్లో సీహెచ్ పౌడర్ విక్రయించిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని ఎకై ్సజ్ శాఖాధికారులు తెలిపారు. శనివారం రాయచూరు చంద్రబండ రహదారిలో బ్రూస్లీ మహేష్, నరేష్‌ల ఇళ్లపై దాడి చేసి 1325 లీటర్ల సీహెచ్ పౌడర్‌ను స్వాధీనపరుచుకున్నట్లు వివరించారు. దాని విలువ రూ.3 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఎకై ్సజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు, ట్యాంకర్ బోల్తా
● 13 మందికి గాయాలు
● కలబుర్గి జిల్లాలో ప్రమాదం
రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లా చించోళి వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడ్డ ఘటనలో 13 మందికి గాయాలయ్యాయి. శనివారం చించోళి తాలూకా పోలకహళ్లి–కుంజాపూర్ మధ్య పోలకహళ్లి తాండా వద్ద ఆర్టీసీ బస్సు, సిమెంట్ ట్యాంకర్ లారీ, ఆటోల మధ్య ముఖాముఖి ప్రమాదం జరిగింది. తెలంగాణలోని తాండూరు నుంచి వస్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీ ఆటోను తప్పించబోయి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 13 మంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం కలబుర్గి, బీదర్ ఆస్పత్రులకు తరలించారు. బస్సు కండక్టర్ విజయ్ కుమార్, డ్రైవర్ మహ్మద్ లాల్‌లు కూడా గాయపడ్డారని ఎస్‌ఐ గంగమ్మ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కపిల్‌దేవ్ వివరించారు.
ఫ్లెక్సీల తొలగింపుపై ఆందోళన
రాయచూరు రూరల్: నగరంలో వాసవీ జయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో నగర పాలక సంస్థ అధికారులు ఫ్లెక్సీలు తొలగించడం తగదని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. శనివారం నగరేశ్వర దేవస్థానం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆర్యవైశ్య సమాజం అధ్యక్షుడు పురుషోత్తం మాట్లాడారు. సమాజంలో ఏడాదికి ఒకసారి మూడు రోజుల పాటు జయంతి ఉత్సవాలకు ఫ్లెక్సీలు వేసుకోడానికి అనుమతి పొందినా బలవంతంగా వాటిని తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలని ఒత్తిడి చేశారు. ఆందోళనలో పద్మరాజ్, జగదీష్, వీరేష్, వెంకణ్ణ, గోవిందు, దత్తాత్రేయ, శ్రీనివాస్, నాగరాజ్ తదితరులున్నారు.
సమాజానికి ఉత్తమ
సందేశాలు అందించాలి
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో ప్రజలకు, సమాజానికి ఉత్తమ సందేశాలు అందించాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు పేర్కొన్నారు. శనివారం నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో గిరి అభయాంజనేయ సేవా సమితి ఏర్పాటు చేసిన అభయాంతరంగ గ్రంథాన్ని విడుదల చేసి మాట్లాడారు. నేడు సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సేవలు అందించే పద్ధతిని అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో శరణ బసవ దేవరు, రాఘవేంద్ర కుష్టిగి, బసవరాజ్, రుద్రప్ప అంగడి, చామరాజ పాటిల్, మహంతేష్, శరణప్ప, రవీంద్ర, శ్రీకాంత్, నాగనగౌడ, శివమూర్తి, అమరేగౌడ తదితరులు పాల్గొన్నారు.


