పరిశుభ్రత పరిరక్షణకు సహకరించండి | - | Sakshi
Sakshi News home page

పరిశుభ్రత పరిరక్షణకు సహకరించండి

Apr 26 2026 2:21 AM | Updated on Apr 26 2026 2:21 AM

హొసపేటె: ప్రజలు తమ ఇళ్ల ముందు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మున్సిపాలిటీతో సహకరించాలని మరియమ్మనహళ్లి మున్సిపాలిటీ ముఖ్యాధికారి మల్లేశప్ప గరడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాలూకాలోని మరియమ్మనహళ్లిలోని 15 వార్డులలో అయ్యనహళ్లి, కే.లోకప్పనహొల రోడ్ల వెంబడి మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులు చెత్తను తొలగించిన అనంతరం ఆయన మాట్లాడారు. రోడ్ల పక్కన ఇరుగు పొరుగు వారు చెత్తను పారవేయడంపై ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో, ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి, ఇక్కడ ఎవరూ చెత్తను వేయొద్దు అని రంగోలీలు వేసి వినూత్నంగా అవగాహన కల్పించారు. చెత్త వేసే ప్రజల దృష్టిని ఆకర్షించడానికి పట్టణ పంచాయతీ, మరియమ్మనహళ్లి అనే నినాదాన్ని ఒక రంగోలిపై వేశారు. ఇదే రోడ్డుపై పాఠశాలలు, కళాశాలలు ఉండటంతో ప్రజలు పడేసిన చెత్తతో విద్యార్థులు ముక్కు మూసుకొని వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. మీ చుట్టుపక్కల ప్రదేశాలలో చెత్త వేయకుండా, మీ ఇంటి ముందుకు వచ్చే చెత్త వాహనంలో వేయడం ద్వారా పరిశుభ్రతను కాపాడటానికి పట్టణ పంచాయతీకి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. మున్సిపాలిటీ పారిశుధ్య విభాగాధిపతి పంపాపతి, సామాజిక కార్యకర్తలు మారెమ్మ, మేఘవతి, సిబ్బంది, పౌర కార్మికులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement