రాయచూరు రూరల్: ప్రతిభావంతుడు, సద్గుణ సంపన్నుడుగా తమ మదిలో నిలిచిన పుత్రుడి జ్ఞాపకార్థం ఇంటిలో అతని ప్రతిమను ఏర్పాటు చేసుకొని తల్లిదండ్రులు కొడుకును పూజిస్తున్న ఘటన జిల్లాలోని దేవసూగూరులో వెలుగు చూసింది. పూర్వాపరాలు.. దేవసూగూరులో ఈరణ్ణ, ఈరమ్మ దంపతుల జ్యేష్ట పుత్రుడు విజయ్‌కుమార్ 1999లో కాలేజీకి వెళ్లి చదువుకుంటున్న సమయంలో పచ్చ కామెర్ల వ్యాధి సోకి మరణించాడు. బుద్ధివంతుడిగా, కళాకారుడిగా అన్ని రంగాల్లో ముందుండే తమ కుమారుడి జ్ఞాపకాలను ఆ దంపతులు మరువలేక పోయారు. దీంతో అతని జ్ఞాపకార్థం గత 26 ఏళ్ల నుంచి ఆ ఇంటిలో కొడుకు ప్రతిమను స్థాపించి అభిషేకంతో పాటు పూజలు పూజలు చేస్తున్నారు. ఇంటిలో ప్రతిమను ఏర్పాటు చేసే సమయంలో అందరి నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఎవరి మాటలను పట్టించుకోకుండా గట్టి పట్టుదలతో కొడుకు ప్రతిమను ఏర్పాటు చేసుకొని ఇంటిలోనే భౌతికంగా తమతోనే ఉన్నాడనే భావనతో తమ్ముళ్లు సురేష్, అశోక్‌లతో కలిసి దేవుడి పూజకు ముందు విజయ్ కుమార్ ప్రతిమకు నిత్య పూజలు చేస్తున్నారు.
సుపుత్రుని జ్ఞాపకార్థంగా విగ్రహం ఏర్పాటు
ఇంటిలోనే కుటుంబ సభ్యులు పూజలు


