ఉచితంగా రక్త పరీక్షలు
రాయచూరు రూరల్: జిల్లాలో ఉచితంగా రక్త పరీక్షలు చేయాలని జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు పేర్కొన్నారు. కవితాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం ఆయన తనిఖీ చేశారు. దోమల నివారణకు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేపట్టాలని సిబ్బందిని అదేశించారు. ఇంటి వద్ద పరిశుభ్రత పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ రక్తపరీక్షలు నిర్వహించి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకునేలా చూడాలన్నారు.
దోమల నివారణపై ప్రచారం
రాయచూరురూరల్: నగరంలో దోమల నివారణపై ఇంటింటా ప్రచారం చేపట్టాలని రాయచూరు గ్రీన్ సంచాలకుడు రాజేంద్రకుమార్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. హరిజనవాడ ప్రాథమిక అరోగ్య కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇంటి చుట్టూ మెక్కలు నాటి పరిసరాలను సంరక్షించుకోవడం, శుభ్రత పాటించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సరోజ, సంధ్య, పాల్గొన్నారు.
ఉచితంగా రక్త పరీక్షలు


