రూ.180 కోట్ల నిధుల కేటాయింపు
రాయచూరులో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాయి. రాష్ట్ర సర్కారు రూ.180 కోట్లతో టెండర్ పిలిచింది. రైట్ సంస్థ రూ. 216 కోట్ల నిధులు కేటాయించింది. కళ్యాణ కర్నాటక అభివృద్ధి మండలి, జిల్లా గనుల శాఖ, కేఎస్‌ఐడీఎల్ అధ్వర్యంలో పనులు వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్యకీయ శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ అధికారులు, టెండరు దక్కించుకున్న గుత్తేదారులను అదేశించారు. అధికారులతో సమీక్షించిన ఆయన పెండింగ్ పనులు, రన్‌వే, ఇతరత్రా పనులను వేగవంతం చేయాలని సూచించారు. భూమి సర్వే చేయడంతోపాటు, బాధితులకు పరిహారం అందించే విషయంపై ఎవరూ అలక్ష్యం చేయరాదన్నారు.


