
మైసూరు ఉత్సవాలకు తొలి అడుగు
మైసూరు: అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా మహోత్సవాల కోసం సన్నాహాలు ఊపందుకున్నాయి. దసరా ఉత్సవాలలో ప్రధాన పాత్ర పోషించేవి గజరాజులే. ఆ ఏనుగుల మొదటి బృందం సోమవారం కదలిరానుంది. 9 ఏనుగులు వస్తున్నట్లు సమాచారం. హుణసూరు తాలూకా వీరనహోసహళ్లిలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది.
భారీ స్వాగతోత్సవం
వీరనహోసహళ్లికి సోమవారం మధ్యాహ్నం 12:34 నుంచి 12:59 శుభలగ్నంలో అడవిలోని శిబిరం నుంచి గజబృందం చేరుకోనుంది. వీటికి ప్యాలెస్ పురోహితులు వేద మంత్రాల తో స్వాగతిస్తారు. జిల్లా మంత్రి హెచ్‌సీ మహదేవప్ప పుష్పార్చన చేసి గజపయనాన్ని ప్రారంభిస్తారు. పూజల తర్వాత కార్యక్రమంలో హాసన్, సకలేశపుర, కొడగు తదితర ప్రాంతాల్లో రౌడీ ఏనుగులు, వన్యజీవులను పట్టుకోవడంలో నిపుణుడైన భీమా ఏనుగు మావటీ గుండ, అలాగే కాపలాదారు నంజుండస్వామికి అవార్డులను అందజేస్తారు. మావటీలు, కాపలాదారులకు కిట్లను ఇస్తారు. తొలి దశలో 9 ఏనుగులు మైసూరు ప్యాలెస్‌కు వస్తున్నాయి. డీసీఎఫ్ ప్రభుగౌడ మాట్లాడుతూ దసరా మహోత్సవంలో పాల్గొనే అన్ని ఏనుగులు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.
నేడే ఆర్భాటంగా గజ పయనం