
నేడు 11, 12, 13 పాయింట్లలో తవ్వకాలు
శివాజీనగర: ధర్మస్థలలో వందలాది మంది మృతదేహాల కోసం గాలింపులో పెద్ద మలుపులేవీ కానరాలేదు. 6వ పాయింట్‌లో లభించిన అస్థిపంజరం 40–50 సంవత్సరాల పాతబడినదని సమాచారం. ధర్మస్థల నేత్రావతి ఒడ్డులో 13 పాయింట్లలో గాలింపు జరుగుతోంది. ఇప్పటివరకు 6వ పాయింట్ మాత్రం ఓ అస్థిపంజరం లభించింది. అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. 40 సంవత్సరాల క్రితం శవం పూడ్చిపెట్టి ఉంటారని నిపుణులు చెప్పినట్లు తెలిసింది. ఇది పురుషుని అస్థిపంజరం. మరో వారంలో దీనిపై అఽధికారిక సమాచారం వెల్లడి కానున్నది. కాగా, సిట్ సిబ్బంది, పోలీసులు, కూలీలు విశ్రాంతి కోసం ఆదివారం తవ్వకాలకు బ్రేక్ ఇచ్చారు. ఇప్పటివరకు 10 పాయింట్లలో తవ్విచూశారు. 6వ పాయింట్‌లో మినహాయిస్తే మిగతాచోట్ల పెద్దగా ఏమీ దొరకలేదు. సోమవారం 11, 12, 13 పాయింట్లలో తవ్వుతారు. అన్ని పాయింట్ల వద్ద సాయుధ పోలీసు భద్రత ఏర్పాటైంది. సోమవారం ఏమైనా జరగవచ్చా అని కుతూహలం నెలకొంది. 13 పాయింట్ల తవ్వకాలు పూర్తయిన తరువాత సిట్ తదుపరి కార్యాచరణపై యోచించనుంది.
అందరి చూపు వాటి మీదే