
మాఫియా కవిరాజ్‌కు కటకటాలు
కోలారు: హత్య, దోపిడీతో పాటు వివిధ ప్రాంతాలలో సుమారు 14 అపరాధ కేసులలో నిందితునిగా ఉండి పరారీలో ఉన్న మాఫియా నేరగాడు కవిరాజ్ అలియాజ్ రాజ్‌ను కోలారు సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణ (సెన్) పోలీసులు అరెస్టు చేశారు. ఇతను ఉత్తరాఖండ్ లోని నేపాల్ సరిహద్దు ప్రాంతానికి చెందిన వాడు. తల్లిదండ్రులతో కలిసి బెంగుళూరుకు నివాసం మార్చాడు. అండర్‌వరల్డ్ డాన్‌లు అయిన రవి పూజారి, ముత్తప్ప రై సహచరునిగా ఉండేవాడని తెలిసింది.
చాలా కేసుల్లో నిందితుడు
కవిరాజ్ 2020లో జరిగిన మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్ కిడ్నాప్ కేసుతో పాటు దేశవ్యాప్తంగా 14కు పైగా వివిధ కేసులలో కోర్టు విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలో ఉన్నాడు. బెంగళూరులో కామాక్షిపాళ్య, తిలక్‌నగర్, కెంగేరి, ఆడుగోడి లలో సర్జాపుర, కాడుగోడి, ఇందిరానగర, బయ్యప్పనహళ్లి , తళి, కోలారు రూరల్ పోలీస్ స్టేషన్‌లలో ఇతనిపై కేసులు ఉన్నాయి. ఎస్పీ నిఖిల్ నేతృత్వంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఢిల్లీ వద్ద నోయిడాలో ఉన్నట్లు కనుగొన్నారు. జూలై 31వ తేదీన అరెస్టు చేసి తీసుకొచ్చారు. ఆచూకీ తెలియరాదని కవిరాజ్ మొబైల్‌ఫోన్‌ను ఉపయోగించే వాడు కాదు.
నోయిడాలో పట్టుకున్న కోలారు పోలీసులు