
నాటు పడవ బోల్తా.. మత్స్యకారుల గల్లంతు
బనశంకరి: ఉత్తర కన్నడ జిల్లా భట్కళ తాలూకా అళ్వకూడి వద్ద అరేబియా సముద్రంలో బుధవారం నాటు పడవ బోల్తాపడి నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. మనోహర అనే వ్యక్తికి చెందిన మహసతి అనే బోటులో ఆరుగురు సంప్రదాయక చేపల వేటకు వెళ్లారు. భారీ ఎత్తున అలలు రావడంతో బోల్తా పడింది. రక్షణా సిబ్బంది రంగంలోకి దిగి మనోహర మోగీర, రామాఖార్వి అనే మత్స్యకారులను రక్షించారు. రామకృష్ణ మోగీర, సతీశ్‌మోగీర, గణేశ్‌మోగీర, నిశ్చిత్ మోగీర అనే నలుగురు గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం గాలింపుచర్యలు చేపట్టారు. బోల్తా పడిన పడవ అళ్వేకోడి బ్రేక్‌వాటర్ వద్ద లభించింది. భట్కళ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఇద్దరిని కాపాడిన రక్షణ సిబ్బంది