
పూజిస్తూ.. ఆడుకుంటూ.. ఆనందిస్తూ..
రాయచూరు రూరల్: దేశవ్యాప్తంగా మంగళవారం భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో నాగ పంచమి వేడుకలు జరుపుకుంటే జిల్లా సరిహద్దులోని ఓ గ్రామ ప్రజలు అందరికీ భిన్నంగా తేళ్ల పంచమిని జరుపుకున్నారు. కర్ణాటకలోని యాదగిరి జిల్లా గురుమఠకల్ తాలూకా కందుకూరు సమీపంలోని కొండమాయి అమ్మవారి సన్నిధిలో తేళ్ల పంచమి సందర్భంగా భక్తులు కొండమాయిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కొండపై ఆలయ పరిసరాల్లోని ఏ చిన్న రాయిని తొలగించినా వాటి కింద కుప్పలుగా తేళ్లు కనిపించాయి. తేళ్లను పట్టుకోవడానికి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహాన్ని కనబరిచారు. ఈ తేళ్లను చేతితో తాకినా, పట్టుకున్నా, శరీరంపై పాకించుకున్నా అవి అసలు కుట్టనే కుట్టవు. అమ్మవారి మహిమతో తేళ్లు తమకు ఏ హానీ చేయవని భక్తుల విశ్వాసం. వాతావరణ పరిస్థితులు, వన మూలికల కారణంగా ఆ తేళ్లు కుట్టలేవని నమ్మకం. పంచమి సందర్భంగా భక్తులు పట్టుకున్న తేళ్లను తమ ముఖం, మెడ, నాలుకపై వేసుకుని ఆనంద పడ్డారు. పంచమి రోజున పూజలు చేయడంతో తమకన్ని విధాలుగా మేలు జరుగుతుందన్న నమ్మకంతో భక్తులు వేలాదిగా తరలి వచ్చి మొక్కులను తీర్చుకుంటారు. ప్రతి శ్రావణ మాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
తేళ్లను తాకితే మంచి జరుగుతుంది..
కొండమాయి గుట్టపై తేళ్లను తాకితే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. పట్టుకున్నా కరవని తేళ్ల వైనం. నాగ పంచమి రోజు నాగులకు నైవేద్యంగా సమర్పించే పాలు, నువ్వులు,బె బెల్లం తదితర పదార్థాలతో తయారు చేసిన వాటిని తేళ్ల పంచమి రోజు ఆ గుట్టపై ఉంచి పూజలు చేస్తారు. ఈ పూజలు చేసే క్రమంలో తేలును తాకడం ద్వారా తమకు మేలు జరుగుతుందని భక్తుల విశ్వసిస్తారు. కర్ణాటకలోని పలు గ్రామాల భక్తులు ఈ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు.
శరీర భాగాలపై తేళ్లను
పాకించుకుంటున్న వైనం
ఇదో రకం వింత అనుభూతి
అంటున్న యువత
నాగ పంచమి పర్వదినం రోజున
కుట్టని తేళ్లు
ఏళ్ల తరబడి అనాదిగా
కొనసాగుతున్న ఆచారం
అంతటా నాగ పంచమి..
కందుకూరులో మాత్ర ం తేళ్ల పంచమి

పూజిస్తూ.. ఆడుకుంటూ.. ఆనందిస్తూ..

పూజిస్తూ.. ఆడుకుంటూ.. ఆనందిస్తూ..

పూజిస్తూ.. ఆడుకుంటూ.. ఆనందిస్తూ..

పూజిస్తూ.. ఆడుకుంటూ.. ఆనందిస్తూ..

పూజిస్తూ.. ఆడుకుంటూ.. ఆనందిస్తూ..