
పట్టపగలే ఎలుగుబంటి హల్‌చల్
హొసపేటె: తాలూకాలోని ఇంగళిగి గ్రామంలోని జనావాస ప్రాంతంలో తన పిల్లలతో ఎలుగుబంటి సంచరిస్తూ కనిపించింది. ఈ ఆశ్చర్యకరమైన దృశ్యం స్థానికుల్లో భయాందోళన వాతావరణాన్ని సృష్టించింది. రైతులు తమ పొలాలకు, పిల్లలు గ్రామంలోని ప్రధాన రహదారి గుండా పాఠశాలలు, కళాశాలలకు వెళుతుండగా ఎలుగుబంటి సంచారంతో ఆశ్చర్యకరమైన పరిస్థితిని సృష్టిస్తోంది. పెద్ద ఎలుగుబంటితో పాటు రెండు పిల్లలు దాని వెనుక ఉండటంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. మహిళలు, పిల్లలు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఏదైనా విపత్తు సంభవించక ముందే అటవీ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై ఎలుగుబంటిని, దాని పిల్లలను బంధించి సుదూరంలోని అటవీ ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

పట్టపగలే ఎలుగుబంటి హల్‌చల్