హెల్మెట్‌ తప్పనిసరి ఆదేశాలు వద్దు | - | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌ తప్పనిసరి ఆదేశాలు వద్దు

Jun 17 2025 5:26 AM | Updated on Jun 17 2025 5:26 AM

హెల్మెట్‌ తప్పనిసరి ఆదేశాలు వద్దు

హెల్మెట్‌ తప్పనిసరి ఆదేశాలు వద్దు

బళ్లారిఅర్బన్‌: నగరంలో అధిక ఉష్ణోగ్రత తాకిడితో ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్‌ ధరించి సంచరించడం చాలా కష్టం అవుతుందని, ఒక వేళ హెల్మెట్‌ తీసి తిరిగి ధరిస్తే వెంట్రుకలు రాలిపోవడంతో చర్మ రోగాల బారిన పడి అనేక అనారోగ్య సమస్యలకు స్థానికులు బాధితులు అవుతున్నారు. అందువల్ల తక్షణమే హెల్మెట్‌ తప్పనిసరి ఆదేశం రద్దు చేయాలని కన్నడనాడు రైతు సంఘం రాష్ట్రాధ్యక్షుడు మెణసిన ఈశ్వరప్ప డిమాండ్‌ చేశారు. సోమవారం ఈ మేరకు ఆయన జిల్లాధికారి కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు ఆందోళన చేపట్టి ప్రదర్శనగా జిల్లాధికారి కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ హెల్మెట్‌ ధరించడం వల్ల చిన్న చితకా దొంగతనాలు జరుగుతాయని ఆయన వాపోయారు. హెల్మెట్‌ కన్నా ముందు గుంతలమయం అయిన రోడ్లను, ముఖ్యంగా వర్షాలతో లోయలను తలపిస్తున్న గుంతలను తక్షణమే మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలన్నారు. కేవలం హెల్మెట్‌ ధరించడం వల్ల ప్రమాదాల నియంత్రణ సాధ్యం కాదు. రోడ్లు కూడా తగిన రీతిలో మరమ్మతులు చేపట్టడం కూడా చాలా అవసరం అన్నారు. ఈ విషయంలో ఇప్పటికే పాలికె కమిషనర్‌కు విజ్ఞప్తి చేసినా గుంతలు, లోయలమయమైన రోడ్ల మరమ్మతులు మాత్రం ఇంత వరకు చేపట్టలేదన్నారు. ఈ సందర్భంగా ఆ సంఘం నేతలు రాజశేఖర్‌ గౌడ, రుద్రయ్యస్వామి, విశ్వనాథ్‌ గౌడ, ప్రదీప్‌, మంజునాథ్‌, ప్రహ్లాద్‌, ప్రసాద్‌, శ్రీనివాస్‌రెడ్డి, గోవిందప్ప, నాగరాజ్‌ పాల్గొన్నారు.

ముందుగా రోడ్లలో గుంతలను పూడ్చాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement