మాటామాటా పెరిగి మిత్రుడికి కత్తిపోట్లు | - | Sakshi
Sakshi News home page

మాటామాటా పెరిగి మిత్రుడికి కత్తిపోట్లు

Jun 19 2025 4:20 AM | Updated on Jun 19 2025 4:20 AM

మాటామ

మాటామాటా పెరిగి మిత్రుడికి కత్తిపోట్లు

హుబ్లీ: స్నేహితుల మధ్య తమాషా ప్రసంగం వికోపానికి దారి తీయడంతో ఓ స్నేహితుడిపై మరో స్నేహితుడు చాకుతో దాడి చేసి పొడిచిన ఘటన దేవరగుడిహాళలో చోటు చేసుకుంది. నగరంలోని శివశంకర కాలనీ నివాసి అవినాష్‌(24) దాడికి గురైన యువకుడు. పార్టీ చేసుకోవడానికి స్నేహితులంతా దేవరగుడిహాళకు వెళ్లారు. పార్టీలో అభిషేక్‌, అవినాష్‌ల మధ్య తమాషాగా చేసిన వ్యాఖ్యలు వికోపానికి దారి తీయడంతో పరస్పరం ఇద్దరు తలపడ్డారు. ఈ క్రమంలోనే అభిషేక్‌ చాకుతో అవినాష్‌ను పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అవినాష్‌ను అతడి స్నేహితులు చికిత్స కోసం కేఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న అవినాష్‌ గురించి తల్లిదండ్రులు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

21న మంత్రి బోసురాజుకు అభినందన కార్యక్రమం

రాయచూరు రూరల్‌: నగరంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఈనెల 21న రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజుకు అభినందన కార్యక్రమం చేపట్టినట్లు మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్‌ తెలిపారు. 79 ఏళ్ల వయస్సు నిండిన సందర్భంగా పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని చైతన్య సాగర అభినందన గ్రంథాన్ని విడుదల చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వాకిటి శ్రీహరితో పాటు కర్ణాటక రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్‌ జీ.పరమేశ్వర్‌, మంత్రులు హెచ్‌.కే.పాటిల్‌, శరణ ప్రకాష్‌ పాటిల్‌, శివరాజ తంగడిగితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొంటారన్నారు.

వికృత కాముకుని అరెస్ట్‌

ఏఐ ద్వారా ఆశ్లీల వీడియోలు పంపి

వేధింపులు

మొబైల్‌లో భారీగా యువతుల ఆశ్లీల

వీడియోలు

మహిళలకు వాటిని పంపుతూ

బెదిరిస్తున్న వైనం

సండూరు ఫ్యాక్టరీలో బిహార్‌కు చెందిన వ్యక్తికి ఉపాధి

సాక్షి,బళ్లారి: అతను బిహార్‌కు చెందిన వ్యక్తి. సండూరులో బతుకు దెరువు కోసం వచ్చి ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం సంపాదించుకుని పని చేస్తూ, మరో కోణంలో వికృత కాముకుడయ్యాడు. వేలాది మంది మహిళలకు సంబంధించిన ఆశ్లీల విడియోలు తన మొబైల్‌లో భద్ర పరుచుకుని వాటిని ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళలకు ఏఐ ద్వారా వారి ఫోటోలను మార్ఫింగ్‌ చేసి ఆశ్లీల వీడియోలు పంపుతూ, నగ్నంగా మారాలని, డబ్బులు పంపాలని బెదిరిస్తూ వికృతంగా ప్రవర్తించడంతో ముంబైకు చెందిన ఓ మహిళ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ద్వారా మహిళలను పరిచయం చేసుకుని, అనంతరం స్నేహంగా మలుచుకుని మాయమాటలు చెప్పి వారికి వీడియో కాల్‌ చేసి నగ్నంగా మారాలని బెదిరింపులు చేసేవాడని తెలుస్తోంది. వికృత కాముకుడు చెప్పిన వాటికి మహిళలు ఒప్పుకోకపోతే తనకు ఉన్న సాంకేతికతతో ఏఐ ద్వారా వారి ఫోటోల నకిలీ ఆశ్లీల వీడియోలు వారికి పంపి బెదిరింపులకు గురి చేసేవాడని పోలీసులు తనిఖీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబై మహిళ ఫిర్యాదు చేపట్టగా అక్కడి పోలీసులు సండూరుకు వచ్చి బిహార్‌కు చెందిన వ్యక్తిని అరెస్ట్‌ చేసి తీసుకెళ్లడంతో సండూరులో వికృత కాముకుడి అసలు రంగు బయటకు బడింది. ఈ విషయం సండూరులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మాటామాటా పెరిగి  మిత్రుడికి కత్తిపోట్లు1
1/1

మాటామాటా పెరిగి మిత్రుడికి కత్తిపోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement