గేట్లు పడితే అంతే సంగతులు | - | Sakshi
Sakshi News home page

గేట్లు పడితే అంతే సంగతులు

Jun 16 2025 6:56 AM | Updated on Jun 16 2025 6:56 AM

గేట్ల

గేట్లు పడితే అంతే సంగతులు

సాక్షి బళ్లారి: బళ్లారి నగరంలో రోజు రోజుకు ట్రాఫిక్‌ సమస్య జటిలమవుతోంది. మోతీ సర్కిల్‌, రాయల్‌సర్కిల్‌, బెంగళూరు రోడ్లలో ట్రాఫిక్‌ సమస్య ఒకలా ఉంటే గుగ్గరహట్టి రైల్వే గేటు ట్రాఫిక్‌ సమస్య నగరవాసులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ రైల్వే లైన్‌లో రోజూ పదుల సంఖ్యలో రైళ్లు ప్రయాణిస్తుంటాయి. దీంతో తరచూ గేట్లు వేస్తుంటారు. ఫలితంగా అటూ ఇటూ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. ఇక్కడ నాలుగు ప్రధాన రోడ్ల నుంచి వాహనాలు వచ్చి గేటు వద్ద ఆగిపోతుంటాయి. గుగ్గరహట్టి నుంచి వచ్చే వాహనాలు – హొన్నహళ్లి, కాకర్లతోట నుంచి వచ్చే వాహనాలు, బెంగళూరు నుంచి బళ్లారి వైపు వచ్చే వాహనాలు, బళ్లారి నుంచి బెంగళూరు వైపు వెళ్లె వాహనాలు గుగ్గరహట్టి రైల్వే గేటు వద్ద ఒకే సారి వచ్చినప్పుడు ట్రాఫిక్‌ స్తంభిస్తుంది. ఈ రోడ్డు చిన్నదిగా ఉండటం కూడా ట్రాఫిక్‌ సమస్యకు కారణమవుతోంది. గుగ్గరహట్టి రైల్వే వంతెన నిర్మిస్తే ట్రాఫిక్‌ సమస్య నివారణ జరుగుతోందని స్థానికులు అంటున్నారు. అయితే ఇక్కడ వంతెన నిర్మాణం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. రోడ్డు వెడల్పు పనులు చేపట్టడంలో అధికారులు, పాలకులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రైల్వేగేటు పడినప్పుడు స్కూల్‌ బస్సులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతుంటాయి. దీంతో విద్యార్థులు సకాంలో పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు. అంబులెన్స్‌ల్లో బెంగళూరుకు రోగులను తీసుకొని వెళ్లెటప్పుడు సమయం వృథా అవుతోంది. రోగులను నిర్ణీత సమయంలో ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, పాలకులు ట్రాఫిక్‌ సమస్యపై దృష్టిపెట్టాలని నగరవాసులు కోరుతున్నారు.

గుగ్గరహట్టి రైల్వేగేట్‌తో ట్రాఫిక్‌ సమస్య

గంటల తరబడి నిలిచిపోతున్న వాహనాలు

ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్న స్కూల్‌ బస్సుల, అంబులెన్స్‌లు

గేట్లు పడితే అంతే సంగతులు1
1/3

గేట్లు పడితే అంతే సంగతులు

గేట్లు పడితే అంతే సంగతులు2
2/3

గేట్లు పడితే అంతే సంగతులు

గేట్లు పడితే అంతే సంగతులు3
3/3

గేట్లు పడితే అంతే సంగతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement