
యువకుని దారుణ హత్య
సాక్షి,బళ్లారి: దావణగెరె జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన జరిగింది. వివరాలు.. చిత్రదుర్గ జిల్లా హెగ్డేహాళ్ గ్రామానికి చెందిన శివకుమార్(28), పరిమళ ప్రేమించుకున్నారు. అయితే పరిమళ పెళ్లి దావణగెరె జిల్లా హొన్నూరుహట్టి గ్రామానికి చెందిన జయప్పతో జరిగింది. పెళ్లి అయినప్పటికీ పరిమళ, శివకుమార్ ఇరువురి మధ్య స్నేహం, ప్రేమ దూరం కాకపోవడంతో పాటు శుక్రవారం ఇద్దరు కలిసి ఉన్న సమయంలో జయప్ప చూడటంతో పెద్ద బండరాయి తీసుకుని శివకుమార్ తలపై వేసి హత్య చేశాడు. భార్య ప్రియుడి వ్యామోహం నుంచి బయట పడకపోవడంతో కోపంతో ఈ హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కూతురితో కలిసి ఆత్మాహుతియత్నం ●
● తల్లి మృతి, కుమార్తెకు తీవ్ర గాయాలు
హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతిలోని జయనగర్‌లో ఒక మహిళ తన కూతురితో కలిసి శుక్రవారం ఇంటిలో నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని సుమంగళగా పోలీసులు గుర్తించారు. భర్త నిరంతర వేధింపుల కారణంగానే తన ఐదేళ్ల కుమార్తెతో కలిసి ఒంటికి నిప్పు అంటించుకొంది. ఈ ఘటనలో సుమంగళ తీవ్ర గాయాలతో మరణించగా, ఆమె కుమార్తె ప్రాణాపాయం నుంచి బయటపడింది. గాయపడిన కుమార్తెను బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
పదవి కోసమే
సీఎం కులగణన అస్త్రం
● కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వీ.సోమణ్ణ
హుబ్లీ: తమ పదవిని కాపాడుకోవడానికి సీఎం సిద్దరామయ్య కులగణన అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వీ.సోమణ్ణ ఆరోపించారు. హుబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల బాగు కోసం ఆలోచించాల్సిన సిద్దరామయ్య కేవలం తన స్వార్థం కోసం రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కులగణన విషయంలో కాంగ్రెస్‌లోనే ఏకాభిప్రాయం కరువైందన్నారు. సాధక బాధకాలపై అవగాహన లేకుండా మంత్రివర్గంలో సదరు నివేదికను ప్రతిపాదిస్తున్నారన్నారు. కమిషన్ విషయంలో కాంట్రాక్టర్ల ఆరోపణలపై స్పందించిన ఆయన కాంట్రాక్టర్లు బీజేపీ సర్కారును తొలగించారు. ఇప్పుడు వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తారన్నారు. సిద్దరామయ్యతో కలిసి ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశాను, పాత సిద్దరామయ్య ఇప్పుడు లేరు. ఇప్పటి సిద్దరామయ్య ఎవరు అన్నది తనకు తెలియదని అన్నారు. బీజేపీ జనాక్రోశ యాత్రకు పోటీగా కాంగ్రెస్ చేపట్టిన యాత్రపై ఆయన మాట్లాడుతూ డీకే.శివకుమార్ ఇలాంటి కుయుక్తుల్లో మాస్టర్ మైండ్ అని అన్నారు. పైగా కాంగ్రెస్ నేతలకు చేసేందుకు ఏం పని లేదన్నారు. ఆర్థిక సమస్యతో వారి దుకాణం మూసివేశారన్నారు. బంద్ చేసిన దుకాణాన్ని ఏ విధంగా చెప్పుకోవాలి. లక్ష్యాథభిలు, ఉద్దేశాలు లేకుండా కొన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రెండేళ్లలోపే ప్రజలు వీధుల్లో పథకాల వైఫల్యంపై చర్చించుకుంటున్నారన్నారు. వేసవి కాలంలో తాగునీరు, పశువుల రోగాలు, రైతుల గురించి ఆలోచించకుండా సమస్యలను దారి తప్పిస్తున్నారన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతల తీరును చూసి ప్రజలు ఏవగించుకుంటున్నారన్నారు.
కూలింగ్ వాటర్ యూనిట్ వితరణ
రాయచూరు రూరల్: రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) కళాశాల, పరిశోధన ఆస్పత్రికి జేసీఐ ఆధ్వర్యంలో కూలింగ్ వాటర్ యూనిట్‌ను వితరణ చేశారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి జేసీఐ సభ్యులు కమల్ కుమార్ ఈ యూనిట్‌ను అందించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు, వారి సహాయకులకు చల్లని నీటిని అందించాలనే ఉద్దేశ్యంతో పంపిణీ చేశామన్నారు. గౌతమ్ కుమార్, సందీప్, వీరేంద్ర, బసవరాజ్‌లున్నారు.
ఉపాధ్యాయ సేవలకు
క్రమశిక్షణ ప్రధానం
రాయచూరు రూరల్: నేటి సమాజంలో ఉపాధ్యాయ సేవలకు క్రమశిక్షణ ప్రధానం అని తాలూకా విద్యా శాఖాధికారి ఈరణ్ణ పేర్కొన్నారు. శుక్రవారం హష్మియా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బీఈఓ ఆధీనంలో ఉపాధ్యాయుల సేవా జ్యేష్టత పట్టిక, గురు స్పందన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ 2025–26వ విద్యా సంవత్సరంలో విద్యార్థులను పాఠశాలల్లో చేర్చడానికి కార్యరూపం దాల్చాలన్నారు. సేవానుభవం, వయోమితి ఆధారంగా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాఘవేంద్ర, శివరాజ్, ఆనంద్ కుమార్, భీమేష్ నాయక్, మల్లేష్ నాయక్, రావుత్‌రావ్‌లున్నారు.

యువకుని దారుణ హత్య

యువకుని దారుణ హత్య