రాయచూరు రూరల్: యాదగిరిలో గంజి కేంద్రాల ఏర్పాటు హర్షనీయమని నగరసభ అధ్యక్షురాలు లలిత అనాపుర పేర్కొన్నారు. సోమవారం నగరంలోని మాతా మాణికేశ్వరి సంస్థ ఆధ్వర్యంలో అంబిగర చౌడయ్య సర్కిల్, హొన్నయ్య తాత ఆలయం వద్ద గంజి కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. ఈ కేంద్రాలతో వేసవిలో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రజల ఆకలి తీరుతుందన్నారు.
నకిలీ నోట్ల మార్పిడి.. నలుగురు అరెస్ట్
రాయచూరు రూరల్: నకిలీ కరెన్సీ నోట్ల మార్పిడి వ్యవహారంలో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పశ్చిమ పోలీస్ స్టేషన్ సీఐ మేకా నాగరాజ్ వెల్లడించారు. సోమవారం ఆశాపూర్ రహదారిలో దాడి జరిపి సద్దాం నివాసంలో రూ.500 నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనపరుచుకొన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ట్రాన్స్‌పోర్టులో డ్రైవర్, క్లీనర్లుగా పని చేస్తున్న మరిలింగ, సద్దాం, సిద్దలింగప్ప, రవిలను అరెస్ట్ చేసి వారి నుంచి పూర్తి సమాచారం సేకరించామన్నారు.
గంజి కేంద్రాలు ప్రారంభం